Yukti Thareja : తెలుగుతెరకు మరో కొత్తందం పరిచయం కాబోతుంది. అందం, అభినయంతో కట్టిపడేసేందుకు సిద్ధమయ్యింది. యుక్తి తరేజా స్వరాష్ట్రం హర్యానా. 2001 జనవరి 5న హర్యానా రాష్ట్రంలోని కైతాల్. ఆమె తండ్రి పర్వీన్ తరేజా, తల్లి రీటా తరేజా ఢిల్లీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మోడల్ గా ఎదిగిన యుక్తి తరేజా.
2019లో ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో పాల్గొని అందరి చూపును ఆకర్షించింది. మోడలింగ్ వైపు నుంచి సినిమాల దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు ఈ సుందరి రంగబలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరో నాగశౌర్య జోడిగా కనిపించనుంది. వవన్ బసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది.