Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు-హిందీలో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో రాఘవుడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా నటించగా జానకి పాత్రలో
హీరోయిన్ కృతి సనస్ కనిపించింది. అయితే ఆదిపురుష్ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని లెవెల్ బిజినెస్ జరగ్గా.. మరో రికార్డు బిజినెస్ సెన్సేషన్ గా మారింది.
తాజాగా ఇంట్రెస్టింగ్ బజ్ బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ సినిమా నిర్మాతల ఓన్ రిలీజ్ మినహా ఈ చిత్రం తెలుగు హక్కులు నాన్ థియేట్రికల్ హక్కులతో ఏకంగా 400 కోట్ల మేర బిజినెస్ ని జరిపినట్టు సమాచారం. దీంతో భారీ మొత్తం జస్ట్ ఈ హక్కులతోనే వచ్చేశాయని అంటున్నారు. ఇక రిలీజ్ అయ్యాక వసూళ్ల రూపంలో ఆదిపురుష్ ఎంత రాబడుతుందో ఎన్ని రికార్డుల బ్రేక్ చేస్తుందో చూడాలి.