Adipurush Promotions : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతిసనన్ (Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ (Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మొదట సినిమాపై భారీ అంచనాలు ఉన్నా కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్ తో విమర్శలు రాగా, ఇటీవల రిలీజ్ అయిన ఆదిపురుష్ ట్రైలర్ కి అన్ని భాషల ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ వస్తుంది.
టీ సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీని పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం త్వరలో ఆదిపురుష్ ప్రమోషన్స్ ని భారీ లెవెల్లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జూన్ మొదటి వారంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి లో గ్రాండ్ గా నిర్వహించనుండగా
దేశంలోని పలు ఇతర ప్రధాన నగరాల్లో కూడా మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ ని గ్రాండ్ నిర్వహించనున్నారట. ఏదేమైనా ఇప్పటి జనరేషన్ కు ‘రామాయణం’ ని అర్థమయ్యేలా.. అందులోని మోరల్స్ ను పాటించేలా చెప్పాలని మేకర్స్ అనుకున్నారు. దీంతో సినిమాను ఆడియన్స్ కి దగ్గర చేసేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీని జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.