Adipurush Special Shows : గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న చిత్రం ఆదిపురుష్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు-హిందీలో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా 2 ట్రైలర్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో రాఘవుడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా నటించగా జానకి పాత్రలో
హీరోయిన్ కృతి సనస్ కనిపించింది. రామాయణం ఆధారంగా తెరకెక్కగా ఈ మహాకావ్యాన్ని బిగ్ స్క్రీన్స్ పై విట్నెస్ చెయ్యాలని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ భారీ చిత్రానికి సర్వత్రా ఆసక్తి నెలకొనగా నైజాంలో అదనపు షోస్ కి పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ రేట్స్ కూడా పెంచేశారు. అయితే థియేటర్ లో వసతులు, రేట్లు అధికంగా
ఉన్నాయి అంటూ ఆ మధ్య ఏపీలో థియేటర్ల ఇష్యూ గురించి చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆ మధ్య కొన్ని భారీ చిత్రాలకు కూడా ఏపీ సర్కారు అదనపు షోలకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మూవీకి ఏపీలో కూడా ఫ్యాన్స్ కి బెనిఫిట్ షో లు అనేక ప్రాంతాల్లో ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయ్యినట్టు సమాచారం. దీంతో జూన్ 16న తెల్లవారు సమయం నుంచే షోస్ పడిపోయి డార్లింగ్ ఫ్యాన్స్ సందడి షురూ కానుంది.