Akira At Sudarshan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రో సందడి మామూలుగా లేదు. పవన్ ఫ్యాన్స్ అయితే తెగ సందడి చేసేస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ సినిమాలో తొలిసారి మేనమామ, మేనల్లుడు అయిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
దానికి తగ్గట్టుగానే థియేటర్స్ ముందు మాస్ జాతర కనిపిస్తుంది. ఇక మాస్ సెలెబ్రేషన్స్ కి కేరాఫ్ అయ్యినటువంటి మాస్ థియేటర్స్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో మెగా ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. ఇదిలావుండగా ఒక్కసారిగా క్రాస్ రోడ్స్ లో పవన్ ఫ్యాన్స్ ఆనందం రెట్టింపైంది. బ్రో మూవీని ఫ్యాన్స్ తో కలిసి వీక్షించేందుకు పవన్ వారసుడు అకీరానందన్ సుదర్శన్ థియేటర్ లో దర్శనమిచ్చాడు. అకీరా ఎంట్రీతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.
Prabhas Facebook Hacked : హ్యాకైనా డార్లింగ్ ఫేస్ బుక్..
అకీరాకు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ ఇవ్వగా.. ఫ్యాన్స్ మధ్య లోనుంచి థియేటర్ లోకి వెళ్ళిపోయాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ మూవీ అని టాక్. ఇద్దరు మెగా హీరోలను ఒకేసారి స్క్రీన్ పై కనిపించడంతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి తోడు త్రివిక్రమ్ డైలాగ్స్ అదనపు బలం. నవ్విస్తూనే ఏడిపిస్తున్నాడు పవన్ బ్రో..
https://twitter.com/PawanismNetwork/status/1684784466525560832?t=GnRheCXO5oqH2ksglP2nXw&s=19