Allu Arjun – Pushpa : పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ఎంత సక్సెస్ ని అందుకుందో మనందరికీ తెలుసు. అల్లు అర్జున్ సినిమాలోనే అత్యంత భారీ హీట్ గా పుష్ప సినిమా నిలిచింది. అయితే దీన్ని సీక్వెన్స్. ని కూడా తేరకేక్కించే పనిలో సుకుమార్ బిజీ,బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా సీక్వెన్స్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక న్యూస్ ట్రెండింగ్ లో ఉంటూనే ఉంది. ఇప్పుడు అదే కోవలోకి మరో న్యూస్ వచ్చి చేరింది.
వచ్చే ఏడాది ఆగస్టు 15 కి రిలీజ్ కానున్న పుష్ప సీక్వెన్స్ లో భారీ హీరోలనే తీసుకొనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫాహిద్ ఫజల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. రీసెంట్ గా అల్లు అర్జున్ కి ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలే ఉన్నాయి.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ మాత్రం పుష్మా సినిమాను ఇంకో లెవెల్ లోకి తీసుకెళ్తుంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సీన్స్ కోసం తమిళ హీరో కార్తీ ని తీసుకున్నట్లు సమాచారం. ఆ సీన్స్ కి కార్తీ అయితే బాగుంటాడని సుకుమార్ ఫీల్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే దీంట్లో విజయ్ సేతుపతి కూడా మరో విలన్ గా నటించే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజంగా అదే నిజమైతే సినిమా ఏ లెవెల్ లో ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.