Allu Arjun Sreeleela : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అనేక చిత్రాలను నిర్మించి విజయపథంలో సాగిన అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ -2 పేరుతో యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ కి అవకాశం కల్పిస్తున్నారు. అల్లు అరవింద్ ఓ వైపు చిత్ర నిర్మాణం, మరోవైపు ఆహా ఓటీటీ నిర్వహణలోనూ దూసుకుపోతున్నాడు. అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా. ఇంతకు ముందు నేషనల్ ఓటీటీలు ఎన్నింటినో ఆదరించిన తెలుగు ప్రేక్షకులు తొలి మాతృభష ఓటీటీ ఆహాను ఊహించని స్థాయిలో ఆదరించారు.

సిరీస్ ల నుండి షోల వరకు.. ఒరిజినల్స్ నుండి మూవీస్ వరకు అన్నింటిలో ఆహా అనిపించింది. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలను, వెబ్ సిరీస్ లను తెలుగు ప్రేక్షకులను అందిస్తున్న ఆహా వీడియో, ప్రొడక్షన్ ను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఊరిస్తుంది ఆహా టీం. మొన్న త్రివిక్రమ్, బన్నీ పిక్ రిలీజ్ చేసి మళ్లీ కలిశారు ఇద్దరూ అంటూ అందరిలో ఆసక్తిరేకెత్తించారు. ఇంతకు వీళ్లిద్దరూ మళ్లీ కలిసి ఏం చేశారో ఇంకా చెప్పనే లేదు.
నిన్న శ్రీలీల బర్త్ డే సందర్భంగా ఆహా వీడియో వారు అల్లు అర్జున్ మరియు శ్రీలీల పోస్టర్ రిలీజ్ చేయగా పోస్టర్ రెస్పాన్స్ అదిరిపోయింది. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఈ రోజు రాత్రి 7 గంటలకు గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఇది త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆహాకు సంబంధించిన యాడ్ అని తెలుస్తుంది. సినిమా చూపిస్త మావ అంటూ ఈ యాడ్ సాగే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు కూడా బన్నీ, త్రివిక్రమ్ కలిసి యాడ్స్ చేసిన విషయం తెలిసిందే.