Allu Arjun : ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నట్టు వీరు ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ చిత్రాలే చేసిన త్రివిక్రమ్ మొదటిసారి బన్నీతో కలిసి పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు. ఇందుకోసం భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేశాడట గురూజీ.
ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఒకటి, రెండు రోజుల్లో ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉండగా.. అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ ఈ మూవీస్ కంప్లీట్ అయ్యాకే కొత్త సినిమా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే బన్నీ ఫ్యాన్స్, గురూజీ ఫ్యాన్స్ మాత్రం వీరి కాంబోలో రాబోయే 4వ మూవీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.