Animal Movie : యానిమల్ మూవీకి అదే పెద్ద ఇష్యూ..
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న సినిమా యానిమల్.. రణబీర్ కపూర్ హీరోగా నటించిన సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ ఒకటో తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే.. ఈ సినిమా నిడివి అక్షరాల 3 గంటల 21 నిమిషాలు.
Rashmika : యానిమల్ సినిమాకి రష్మీక భారీ డిమాండ్.. పారితోషకం ఎంతంటే..?
ఇంత భారీ రన్ టైం తో సినిమా అంటే రిస్క్ అనే చెప్పాలి. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి మాత్రం ఈ సినిమా నిడివి రిజల్ట్ కి ఏ మాత్రం ప్రభావం చూపదని.. 3 గంటల 21 నిమిషాలు ప్రేక్షకులు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేసే విధంగా ఉందని తన నమ్మకం వెలిబుచ్చారు.

అలాగే అర్జున్ రెడ్డి సినిమా కూడా మూడు గంటల పైన ఉంటుంది అయినా ప్రేక్షకులు బానే చూశారంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.. అయితే మరీ ఇంత రన్ టైం అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే దర్శుకుడికి ఈ విషయం మీద ఎంత నమ్మకం ఉన్నా.. రేపు రిలీజ్ అయ్యాక తేడా వస్తే మాత్రం కష్టమే..
