Anupama Parameswaran : అనుపమా పరమేశ్వరన్.. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరో హీరోయిన్ లుగా వచ్చిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. యూత్ లో ఆమె క్రేజ్ ఏ రేంజ్ ఉండేది అంటే.. “ఆంధ్రలో వరదలు.. అనుపమా నా మరదలు” అనే మీమ్స్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి.
ట్విట్టర్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వాళ్ళల్లో అనుపమా ఒకరు. గత కొంతకాలంగా సరైన హిట్లు లేని అనుకి లేటెస్ట్గా తెలుగులో కార్తికేయ 2తో సరైన టైంలో సూపర్ హిట్ పడింది. ఆ తర్వాత 18 పేజెస్ తో డీసెంట్ హిట్ అందుకున్న అనుపమకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అను చేతిలో టిల్లు స్వ్కేర్, ఈగల్ తో పాటు తమిళ్ లో ఒకటి, మలయాళంలో మరొకటి ఉండగా..
టాలీవుడ్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించనున్న మూవీలో ఆమె హీరోయిన్ గా నటించనుంది. సినిమా బండికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసిన విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇతర విషయాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్. సిద్దు జొన్నలగడ్డకు జోడిగా నటించిన టిల్లు స్వ్కేర్ సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు. సితార ఎంటర్ట్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.