Baby Movie New Added Scenes : టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ఊపు ఊపేస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది బేబి మూవీ. రీసెంట్‌గా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ (Anand deverakonda), వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ మరో లీడ్ రోల్ నటించాడు. జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలి రోజు నుంచి సూపర్ వసూళ్లు రాబడుతూ..

నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 75కోట్లు వసూలు చేసినా ఇంకా ఆ ప్రభంజనం ఆగలేదు. ఆడియన్స్ నుంచే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా బేబిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో కొత్త పాట సహా దాదాపు 14 నిమిషాల పాటు కట్ చేసిన సీన్స్ మళ్లీ యాడ్ చేయాలని నిర్ణయించుకున్నారట మూవీ యూనిట్. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి బేబీ కొత్త వెర్షన్ సినిమా థియేటర్లలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
Chiranjeevi Remuneration : భోళా శంకర్ కు చిరు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!?
అంటే ఇప్పుడీ బేబి సినిమా దాదాపు 185 నిమిషాలు ఉండనుంది. ఇప్పుడు కొత్తగా మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ యాడ్ చేయడంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా యాడ్ చేసే సీన్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వానల్లో, వరదల్లో సైతం బేబిని 2, 3సార్లు చూసారు అనేకమంది. ఇప్పుడు మరిన్ని సీన్స్ యాడ్ చేయడంతో అంతా మళ్లీ చూసే అవకాశం ఉంది. అప్పట్లో దర్శకధీరుడు రాజమౌళి సైతం తన సినిమాలకు విడుదలైన తర్వాత మరిన్ని సీన్స్ యాడ్ చేసి అడియన్స్ ను ఆకట్టుకున్నారు.
