Chiranjeevi Remuneration : శక్తి, షాడో వంటి వరుస ఫ్లాప్ లతో ఉన్న డైరెక్టర్ మెహర్ రమేష్ కి మెగాస్టార్ చిరంజీవి ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో ‘భోళా శంకర్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ తమిళ్ చిత్రం వేదాళం మూవీకి రీమేక్ అని తెలిసిందే. ఇందులో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లు కాగా ఇందులో కీర్తి సురేష్ హీరోకి చెల్లెలి పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
అయితే ఒరిజినల్ మూవీలో చెల్లెలి ప్రియుడు పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అయితే తెలుగులోకి వచ్చేసరికి ఆ పాత్ర ప్రాముఖ్యత పెంచారు డైరెక్టర్. అలాగే యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయగా.. మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
Venu Swamy Sensational Comments : ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటే.. పెటాకులే..
ఈ మూవీకి చిరు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. చిరంజీవి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి. అయితే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా వద్దని చెప్పడట చిరంజీవి. ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.