Balagam Movie : ఇటీవల సెన్సేషనల్ హిట్ మూవీ బలగం. సినిమాలు, కామెడీ షోలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నటుడు వేణు టిల్లు. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. దిల్’ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఓటీటీ విడుదలైనప్పటికీ ఇంకా బలగం థియేటర్ లలో ఆడుతుండడం విశేషం.
ఈ మూవీలోని క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. సెన్సిటివ్ గా ఉండేవారికి తప్పకుండా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఈ సినిమాను గ్రామాల్లో తెరలు ఏర్పాటు చేసి మరీ చూడడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రేక్షకుల హృదయాలతో పాటు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంటుంది బలగం. ఉక్రెయిన్‌లో జరిగిన ఓంక్యో ఫిల్మ్ అవార్డ్స్ లో ఈ చిత్రం ఇప్పటికే ఉత్తమ డ్రామా ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.
తాజాగా బలగం మరో 4 అవార్డులను గెలుచుకుంది. వాషింగ్టన్ DC ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఉత్తమ ఫీచర్ డైరెక్టర్ (వేణు యెల్దండి), ఉత్తమ నటుడు (ప్రియదర్శి), ఉత్తమ నటి (కావ్య కళ్యాణ్‌రామ్), మరియు ఉత్తమ కథనం (వేణు యెల్దండి) అవార్డులను గెలుచుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డ్స్ పొందే అవకాశం ఉంది.
Discussion about this post