Balagam Venu Balayya : ఇటీవల సెన్సేషనల్ హిట్ మూవీ బలగం. సినిమాలు, కామెడీ షోలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నటుడు వేణు యెల్డండి. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. దిల్ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ మూవీలోని క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాను గ్రామాల్లో LED తెరలు ఏర్పాటు చేసి మరీ చూడడం గమనార్హం.
ఇదిలా ఉండగా ప్రేక్షకుల హృదయాలతో పాటు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంటుంది బలగం. వేణు దర్శకత్వ ప్రతిభపై మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ప్రశంసల జల్లు కురిపించారు. మొదటి మూవీ సక్సెస్ తర్వాత ప్రెసెంట్ నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. వేణు తర్వాతి సినిమా ఏ హీరోతో తీస్తారనేది ఇప్పటివరకు చెప్పలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వేణు తర్వాతి చిత్రంపై క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది.
వేణు తన రెండో సినిమాను ఓ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు.. నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇప్పటికే బాలయ్యకు వేణు కథ చెప్పాడట. ఆయన కూడా స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వేణుకి బంపరాఫర్ దక్కినట్లే. ప్రెస్రెంట్ బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు.