Balakrishna : నందమూరి ఫ్యాన్స్ తమ బాలకృష్ణ పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ కి బర్త్ డే స్పెషల్‌గా బాలయ్య సినిమాల విషయంలో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ ప్రతిష్టాత్మక మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర చేస్తున్నారు.
నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో భారీ హైప్ కలిగిన ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. “గిప్పటి సంది ఖేల్ అలగ్ అంటూ ‘భగవంత్ కేసరి’గా టైటిల్‌ను అనిల్ రావిపూడి పోస్ట్ చేశారు. మూవీ క్యాప్షన్ గా ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య మాస్ లుక్ ని పోస్టర్లో చూపించారు. ఇప్పటివరకు రాయలసీయ యాసలో
అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన బాలయ్య.. తాజా ప్రాజెక్ట్‌లో తెలంగాణ యాసలో సరికొత్త వినోదాన్ని అందించబోతున్నాడని చెప్పాడు అనిల్ రావిపూడి. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తుండగా.. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో అదరగొట్టిన తమన్ మరోసారి బాలయ్య మూవీకి మ్యూజిక్ అందించేందుకు రెడీ అయ్యాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై దీన్ని గ్రాండ్ లెవెల్లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.