Balakrishna NBK109 : నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. పైగా ఇటీవల అన్ స్టాపబుల్ షోలో హోస్ట్ కూడా అదరగొట్టాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ ఘన విజయం తర్వాత ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డితో బాలయ్య వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో

భగవంత్ కేసరి మూవీలో నటిస్తున్నాడు. మూవీ క్యాప్షన్ గా ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య మాస్ లుక్ ని పోస్టర్ లో చూపించారు. ఇప్పటివరకు రాయలసీయ యాసలో అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన బాలయ్య.. తాజా ప్రాజెక్ట్‌లో తెలంగాణ యాసలో సరికొత్త వినోదాన్ని అందించబోతున్నాడు. ఈ యాక్షన్ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర చేస్తున్నారు. ఇదిలావుండగా ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా NBK109 మూవీని లాంచ్ చేశారు.
ఈ మూవీని వాల్తేరు వీరయ్యతో తో హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాబీ డైరెక్ట్ చేయనున్నాడు. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటు ఫార్చూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడు. అయితే ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో బాలయ్య సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.