Bro Day 1 Collection : మెగా హీరోలు పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్‌తేజ్(Saidharam Tej) హీరోలుగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్రో మూవీ ఫస్ట్ డే అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. ఫాంటసీ ఎంటర్టైనర్గా దర్శకుడు సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కించారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. బ్రో మూవీ కంటెంట్ విషయంలో కొన్ని విమర్శలు వినిపించినా పవన్ మ్యాజిక్ మాత్రం బాగా పని చేసింది.
ఈబీసినిమా ఫస్ట్ రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.48.09కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.35.50 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ చూస్తుంటే.. రాబోయే రెండు రోజుల్లోనే ‘BRO’ బ్రేక్ ఈవెన్‌ను సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. బ్రో సినిమా 76.77% ఆక్యుపెన్సీని కలిగి ఉంది. పవన్ మేనియాతో ఈ సినిమా మెుదటి రోజు భారీగానే వసూళ్లు చేసింది.
Venu Swamy Sensational Comments : ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటే.. పెటాకులే..bro
ఒక్క నైజాం ఏరియాలోనే ఈ మూవీ 14 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 1. ఆదిపురుష్ (హిందీ, తెలుగు, తమిళం, మలయాళం)140 కోట్లు,2.వీరసింహారెడ్డి, 50.1 కోట్ల గ్రాస్, 3.వాల్తేర్ వీరయ్య, 49.1 కోట్లు గ్రాస్, 4. బ్రో: 45 నుంచి 50 కోట్ల గ్రాస్. ఇక ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మనందం, రోహిణి, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలో నటించారు.