Bro Pre Release Event : గత రెండు రోజుల నుంచి బ్రో పోస్టర్స్, నిన్న బ్రో టీజర్ తో సోషల్ మీడియా షేక్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో ది అవతార్. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. టీజర్ తో మామఅల్లుళ్లు మాస్ లుక్ తో మెంటలెక్కించారు. టీజర్ రావడంతో నెక్స్ట్ ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈవెంట్ కి రాకపోవచ్చని తెలుస్తుంది. కానీ పవన్ కోసం మెగాస్టార్ చిరుతో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ఈ ఈవెంట్ కి వస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎలాగూ సాయిధరమ్ తేజ్ ఉంటాడు కానీ స్పెషల్ గెస్టులుగా మెగా ఫ్యామిలీ నుంచి వారు వచ్చే అవకాశం ఉంది. తమిళ్ ‘వినోదయ సీతమ్’ సినిమాను తెలుగులో బ్రో ది అవతార్ గా పవన్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇది రీమేక్ అయినప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు చేశారు మేకర్స్.
దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారు. ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.