Bro Teaser : షూటింగ్స్ కి కొంత గ్యాప్ ఇచ్చి.. ఏపీలో వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ బ్రో. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. వరుస పోస్టర్స్ మూవీపై ఒక్కసారిగా హైప్ పెంచేశారు. కాసేపటి క్రితం విడుదలైన టీజర్ తో మామఅల్లుళ్లు మెంటలెక్కించారు. పవన్ లుక్ అదిరిపోగా.. సాయిధరమ్ తేజ్ స్టలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు.
కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం అంటూ సాగే టీజర్ 1:27 నిడివితో ఆద్యంతం ఆకట్టుకున్నారు పవన్, సాయిధరమ్ తేజ్. నోట్లో బీడీ, చేతిలో టీ గ్లాస్, మెడలో రెడ్ టవల్ , కంఠంలో త్రిశూలం, ఓంకారం లాకెట్ తో ఊర మాస్ లుక్ తో ఫ్యాన్స్ కి మెంటక్కించాడు. తమిళ్ ‘వినోదయ సీతమ్’ సినిమాను తెలుగులో బ్రో ది అవతార్ గా పవన్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారు.
ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.