Bro Teaser Update : షూటింగ్స్ కి కొంత గ్యాప్ ఇచ్చి.. ఏపీలో వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ బ్రో. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇందులో భాగంగానే నిన్న పవన్ మరియు సాయి తేజ్ లుంగీ కట్టిన మాస్ పిక్ వదిలే హైప్ పెంచేసారు. ఈ రోజు టీజర్ కోసం పవన్ డబ్బింగ్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి భీమవరం వెళ్లారు.
పవన్ డబ్బింగ్ పూర్తి కావడంతో టీజర్ రేపు సాయంత్రం 5:04కి విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. తమిళ్ ‘వినోదయ సీతమ్’ సినిమాను తెలుగులో బ్రో ది అవతార్ గా పవన్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారు.
ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.