Bro The Avatar : గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం “బ్రో ది అవతార్”. మామ అల్లుడిని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. థియేటర్స్ లో పవన్ మేనియా స్టార్ట్ అయ్యింది. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమాక్స్ లో త్రివిక్రమ్ మాటలతో కట్టి పడేసాడు.

ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ చిత్రం తెలుగులో ‘బ్రో’ గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే.. ఈ మూవీకి ముందు సముద్రఖని కాలపురుషుడు అనే టైటిల్ రాసుకున్నాడంట. అదే టైటిల్ అని కన్ఫామ్ అయ్యాడంట.
Bro The Avatar Review : పవర్ స్టార్ ‘బ్రో’ రివ్యూ & రేటింగ్..
అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డామేజ్ చేసినట్లు ఉంటుందని.. అందుకే సింపుల్ అండ్ స్టైలిష్ గా క్యాచీ పదాలు వచ్చేలా బ్రో అనే టైటిల్ పెడితే బాగుంటుంది అంటూ సజిస్ట్ చేశారట. పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కూడా ఇదే ఓకే చేశారట. దీంతో కాలపురుషుడు సినిమా దగ్గర నుంచి బ్రో సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యారంట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి రిలీజ్ కి ముందే 100కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్.