Businessman Re Release : ఈ మధ్య కొత్త సినిమాల రిలీజ్ కు సైతం రాని ఎక్సయిట్మెంట్ రీ రిలీజ్ ని చూశాక వస్తోంది అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి, బిల్లా, ఖుషి, తొలిప్రేమ వంటి సినిమాలు రాగా.. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో మరోసారి ఈ సినిమాల లిస్ట్ లో చేరనున్నాడు. దూకుడు’ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ‘బిజినెస్ మేన్’.
మహేష్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాల్లో బిజినెస్‌మేన్ కూడా ఒకటి. డిఫరెంట్ మేనరిజమ్స్, యాటిట్యూడ్‌తో సూపర్ స్టార్‌ను సిల్వర్ స్క్రీన్ మీద చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.ఆర్.వెంకట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ కు జోడీగా కాజల్ అగర్వాల్ అలరించింది. మహేష్ బాబు డిఫరెంట్ రోల్ ప్లే చేసిన ఈ 2012 జనవరి 13న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అయితే బిజినెస్ మేన్ మూవీని సూపర్ స్టార్ మహేష్ పుట్టిన రోజైన ఆగస్ట్ 9న థియేటర్లలో గ్రాండ్ 4K లి రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఎప్పటి నుంచి సోషల్ మీడియాలో హడావుడి స్టార్ట్ చేశారు. అప్పట్లో మహేష్ బాబును నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన ఈ మూవీ ఇప్పుడు మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే.. ఆగస్ట్ 9 వరకు ఆగాల్సిందే. ప్రెసెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.