Chiranjeevi Mahesh Babu : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో హిట్లు కొట్టిన చిరు హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ చిత్రం వేదాళం మూవీకి రీమేక్ అని తెలిసిందే. ఇందులో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లు కాగా ఇందులో కీర్తి సురేష్ హీరోకి చెల్లెలి పాత్రలో నటిస్తుంది.
అలాగే మరో యంగ్ హీరో సుశాంత్ కూడా ఇందులో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ ఆగస్టులో విడుదల కనుండగా దీని తర్వాత చిరు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి బింబిసార డైరెక్టర్ వశిష్ఠ కాగా మరోకటి బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో మెగాస్టార్ ఒక కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.
కాగా ఈ మూవీలో మరో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇందులో హీరోయిన్ కోసం సౌత్ క్వీన్ త్రిషతో సంప్రదింపులు జరుపుతున్నారు చిత్ర యూనిట్. ఈ మూవీని చిరు కూతురు సుస్మిత గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. వీలైనంత త్వరగా ఈ మూవీ షూట్ కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో నిలపాలని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అండ్ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఒకవేళ అదే నిజమైతే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న గుంటూరు కారం సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నట్టే! పైగా గుంటూరు కారం షూటింగ్ ఆరిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాక రోజు రోజుకి మరింత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే అనేక పర్యాయాలు షూటింగ్ అనుకొని వాయిదా వేసారు మేకర్స్. మళ్లీ షూటింగ్ ఎప్పుడు స్యార్ట్ అవుతుందో కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో సడన్ గా సంక్రాంతి బరిలోకి మెగాస్టార్ రావడంతో మహేష్ తప్పుకున్నట్టే అని అంతా భావిస్తున్నారు.