Chiranjeevi Mega 156 Movie : భోళా శంకర్ భారీ డిజాస్టర్ అయినా డీలా పడకుండా మెగాస్టార్ చిరంజీవి వెంటనే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. బింబిసార మూవీ డైరెక్టర్ మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో ఒక సోషియో ఫాంటసీ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా అనుష్క, నయనతార, మృనాల్ ఠాకూర్, త్రిష అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. అయితే ప్రజెంట్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా మొత్తం ఐదుగురు హీరోయిన్లని వార్త ప్రచారం లోకి వచ్చింది.
ఇది దేవలోకం.. మానవలోకం.. పాతాళ లోకం.. ఇలా మూడు లోకాలు చుట్టూ తిరిగే కథ అని తెలుస్తుంది. అందుకని ఇంతమంది హీరోయిన్లను తీసుకుంటున్నట్లు ఓ ప్రచారం నడుస్తుంది.. అయితే చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో ఒక హీరోయిన్ ను సెలెక్ట్ చేయడమే తలకు మించిన పని అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి సినిమాకు ఏకంగా ఐదుగురు హీరోయిన్లు అంటే వాళ్ళను ఎంపిక చేయడం కత్తి మీద సామే.
భోళా శంకర్ సినిమాలో తమన్నా కూడా చిరంజీవి పక్కన ఎంత మాత్రం కూడా సెట్ కాలేదు. ఇప్పుడు ఈ మెగా 156 సినిమాకి ఐదుగురు హీరోయిన్ల ను ఎంపిక చేయడం అంటే ఎవరిని ఎంపిక చేస్తారో అనేది చూడాలి. అయితే మెగా అభిమానులకు మాత్రం ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సోషియో ఫాంటసీ మూవీ కావడం పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం దర్శకుడు గత చిత్రం బింబిసార కూడా ఆకట్టుకోవడం ఇలాంటి పాజిటివ్ వైబ్స్ ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది.. మెగాస్టార్ మళ్లీ సాలిడ్ హిట్టు కొట్టాలి అని ఆశిద్దాం..