Chiranjeevi Trisha : గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో వరుస హిట్లో దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రెసెంట్ యంగ్ హీరోలతో పోటీగా మూవీ లైనప్ సెట్ చేసుకున్నాడు చిరు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ మూవీలో నటిస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో తమన్నా, హీరోయిన్ కాగా చిరు చెల్లిలో పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. అలాగే యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
భోళాశంకర్ తర్వాత చిరు ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకరు బింబిసార మూవీ ఫేమ్ వశిష్ఠ కాగా మరొకరు బంగార్రాజు మూవీ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ. చిరుతో సోషియో ఫాంటసీ చేయడానికి వశిష్ఠ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటుండగా.. కళ్యాణ్ కృష్ణ మెగాస్టార్ తో ఒక విభిన్నమైన కథాంశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడట. అయితే ఈ మూవీకి చెన్నై చంద్రం త్రిషను ఖారారు చేసినట్టు తెలుస్తోంది. గతంలో త్రిష మెగాస్టార్ సరసన స్టాలిన్ లో నటించింది.
చాన్నాళ్ల తర్వాత ఇద్దరూ మరోసారి జోడికట్టనున్నారు. PS సిరీస్ తర్వాత త్రిషకు అవకాశాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నాలుగు పదుల వయసులోనూ తరగని అందం త్రిష సొంతం. దీంతో సీనియర్ హీరోలకు త్రిష ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. ఇక మూవీలో చిరు తనయుడిగా సిద్ధూ జొన్నలగడ్డ కనిపించనున్నాడని ఆయనకు శ్రీలీలను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మెగాస్టార్ కూతురు సుస్మిత నిర్మిస్తుండటం విశేషం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.