Game Changer Updates : RRR బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్. ప్రెసెంట్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ తన ప్రతి మూవీలో సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాడు గేమ్ ఛేంజర్ లో కూడా తన స్టైల్ కి తగ్గట్టే ప్లాన్ చేసాడు.
అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ టార్గెట్ పెద్దగానే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. RRR మూవీ 1000 కోట్ల పైగా వసూళ్లను రాబట్టడంతో చరణ్ కి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తో గేమ్ చేంజర్ ని కూడా 1000 కోట్ల క్లబ్ లో చేర్చాలని చూస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీ అవ్వగా.. చరణ్ అంతర్జాతీయ వేదికలకు హాజరవుతూ ప్రసంగాలతో అదరగొడుతున్నాడు.
తాజాగా చరణ్ ఎన్టీఆర్ సెంచరీ సెలబ్రేషన్స్, G20 సమ్మిట్ లో పాల్గొన్న విషయం తెల్సిందే. అయితే గేమ్ ఛేంజర్ షూటింగ్ తిరిగి పట్టాలెక్కించే పనిలో పడ్డారు మేకర్స్. మైసూర్ లో జూన్ 4 నుంచి 11 లేదా 12 వరకు అక్కడే షూట్ ప్లాన్ చేశారు. ఇతర నటీనటుల అందుబాటుని బట్టి షెడ్యూల్ లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. ఈ మూవీ రిలీజ్ కోసం మంచి డేట్ కోసం చూస్తున్నారు మేకర్స్.