Guntur Kaaram Crazy Update : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఇంతకు ముందు వీరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. అయితే ఈ గుంటూరు కారం మూవీని మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుస్తున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
అయితే గతకొంత కాలంగా ఈ మూవీలో చిన్నచిన్న మార్పులు చేశారని, షూటింగ్ ఆగిపోయిందని న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజా క్రేజీ న్యూస్ ఏంటంటే.. గుంటూరు కారం లేటెస్ట్ షెడ్యూల్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ గండిపేట దగ్గర ఓ హౌస్ సెట్ లో షూట్ జరుగుతుంది. ఇక ఇప్పటి నుంచి ఈ షూట్ నిరంతరం కొనసాగే అవకాశం ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.