Guntur Kaaram : గత కొంతకాలంగా గుంటూరు కారం మూవీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ వాయిదాల కారణంగా, క్యాస్ట్ అండ్ క్రూ లో మార్పులతో గుంటూరు కారం హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కొత్త సినిమా అనౌన్స్ చేయడంతో ఎక్కడ ఈ మూవీ ఆగిపోతుందో అని అభిమానులు ఆందోళన చెందారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని గుంటూరు కారం నుంచి తప్పించారు అనే టాక్ తో సహా ఏకంగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా సినిమాలో లేదు అనే టాక్ వైరల్ గా మారింది. తాజాగా ఈ రూమర్స్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ మూవీ నుంచి థమన్ ను తప్పించట్లేదట. థమన్ మ్యూజిక్ పట్ల మేకర్స్ సంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పూజ మాత్రం తన డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఈ మూవీ నుంచి తప్పున్నట్టు తెలుస్తుంది.
ఓ నెటిజన్ కి ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇచ్చిన సమాధానాన్ని బట్టి అర్థమవుతుంది. ఎట్టకేలకు తిరిగి ఏ మూవీ షూట్ ని ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జనవరి 13 న విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ , గ్లిమ్స్ తో సోషల్ మీడియా షేక్ అవ్వగా.. గుంటూరు కారం ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ కి అందరి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
Update:
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం…
ఈ నెల 24 నుంచి షూటింగ్..
జనవరి 13న రిలీజ్…
ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉంటే మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్…#GunturKaaram@urstrulyMahesh@haarikahassine @vamsi84 @MusicThaman— YJR (@yjrambabu) June 20, 2023