Hansika : దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ హన్సిక. తర్వాత అడపాదడపా తెలుగు సినిమాల్లో చేసిన ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. అయితే తమిళ్ లో మాత్రం ఈ ముద్దుగుమ్మ బాగానే సెటిలైంది. అక్కడ మంచి కమర్షియల్ హీరోయిన్ గానే కాక
లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ, తమిళ ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు హన్సిక గార్డియన్ అనే హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శబరి గురు శరవనన్ లు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సి ఎస్ శ్యామ్ సంగీతం అందించారు.
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా నిన్న టీజర్ లాంచ్ అయిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. హన్సికకు తెలుగు లో కూడా ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.