తేజా సజ్జా హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ హిట్టు ఫిల్మ్ హనుమాన్ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన కథతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నార్త్ గడ్డపై కూడా జెండా ఎగుర వేసింది. ఏకంగా అన్ని వేల కోట్లు రాబట్టుకుని.. నార్త్ లో హైయెస్ట్ నెట్ గ్రాసింగ్ సౌత్ సినిమాల్లో టాప్ 10 స్థానాన్ని దక్కించుకుంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా హీరోగా చేయగా.. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేశారు.
ఇప్పటికీ థియేటర్ల వద్ద సందడి చేస్తున్న ఈ సినిమా తాజాగా నార్త్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 సౌత్ చిత్రాల లిస్టులో స్థానం సంపాధించుకుంది. మొత్తం రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టుకుని టాప్ 10గా నిలిచి నయా రికార్డు క్రియేట్ చేసింది. అయితే బాహుబలి 2 రూ.511 కోట్లు రాబట్టుకుని టాప్ 1లో నిలవగా.. రూ.435 కోట్లు సంపాధించుకుని టాప్ 2లో కేజీఎఫ్ 2 నిలిచింది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా రూ.277 కోట్ల రాబట్టుకుని మూడో స్థానంలో నిలిచింది. టాప్ 4లో 2 పాయింట్ ఓ రూ.190 కోట్లతో స్థానం దక్కించుకుంది.
టాప్ 5లో రూ.154 కోట్లతో సలార్ స్థానం సంపాధించుకోగా.. సాహో 150 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి టాప్ 6గా చేసింది. ఇక ఆ తర్వాతి స్థానంలో అంటే టాప్ 7లో రూ.119 కోట్ల రూపాయలు రాబట్టుకుని బాహుబలి స్థానం సంపాధించుకుంది. టాప్ 8లో పుష్ప.. 190 కోట్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక టాప్ 9లో కాంతారా 85 కోట్ల రూపాయలతో నిలవగా.. తాజాగా హనుమాన్ టాప్ 10గా రూ.50 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది.