HanuMan OTT Release : ఇక ఇంట్లోనే ‘హను మాన్’ విన్యాసాలు, ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే..
చిన్న చిత్రంగా విడుదలైన హను మాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే సామెత ఆంజనేయ స్వామి నుంచే పుట్టింది. బహుశా ఆ పేరు బలమో ఏమో కానీ.. హను మాన్ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే. వాటి పోటీని తట్టుకుని హను మాన్ నిలబడగలిగితే చాలు అదే పెద్ద విజయం అని సినీ విశ్లేషకులు అనుకున్నారు.
భారీ చిత్రాల మధ్య చిన్న చిత్రంగా విడుదలైన హను మాన్ బాక్సాఫీస్ ని తగలబెట్టేసింది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 300 కోట్లకి పైగా ఈ చిత్రం వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కంటెంట్ ఉంది.
దీనితో ఈ చిత్రం ఓటిటిలోకి రిలీజైనా మంచి రెస్పాన్స్ ఉంటుందని ఆశిస్తున్నారు. తాజాగా హను మాన్ పాన్ ఇండియా రిలీజ్ గురించి బలమైన వార్తలు వస్తున్నాయి. హను మాన్ పాన్ ఇండియా రిలీజ్ డేట్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోం ది. మార్చ్ 2 నుంచి జీ 5 ఓటిటిలో హను మాన్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆరోజునే హనుమాన్ ఓటిటిలోకి రానుంది.
తేజ సజ్జా, అమృత అయ్యర్ ఈ చిత్రంలో జంటగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ తేజ సజ్జా సోదరి పాత్రలో ఎమోషనల్ పెర్ఫామెన్స్ అందించింది. వినయ్ రాయ్ విలన్ పాత్రలో నటించారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.