Jr NTR Devara : RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన సినిమా పోస్టర్స్ ని చూస్తుంటే..
మంచి యాక్షన్ సినిమానే కొరటాల సిద్ధం చేస్తున్నట్లు అనిపిస్తుంది. నిన్నటితో ఈ మూవీ షెడ్యూల్ ముగిసింది. నెక్స్ట్ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇదిలావుండగా ఈ మూవీలో హీరోయిన్ జాన్వీ పాత్రపై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. సినిమాలో ఆమె ఓ మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని.. జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగాఓణిలో అలాగే పల్చని చీరలోనే ఎక్కువగా కనిపిస్తోందని టాక్.
అయితే జాన్వీ తండ్రి మత్స్యకారుని పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని.. ఆ పాత్ర కోసం మరో భామను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట కొరటాల. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ నటిస్తున్న ఈ మూవీలో మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోనుందని మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ని బట్టి అర్థమవుతుంది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు మేకర్స్.