Jr NTR War 2 Remuneration : RRR మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఇంటర్నేషనల్ స్థాయిలో పలు ప్రముఖ పత్రికలు, మ్యాగజైన్స్ ఆర్టికల్స్ రాశాయి. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ NTR30 లో నటిస్తున్నాడు తారక్. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కబోతున్న ‘వార్ 2’లో ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ మూవీతో యంగ్ టైగర్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ మూవీలో తారక్ తీసుకునే రెమ్యూనరేషన్ నెట్టింట వైరల్ గా మారింది. వార్ 2 కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ. 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్టు సమాచారం. ఈ మూవీలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నాడట. ‘వార్’ సిరీస్‌లో భాగంగా వార్ 2 మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా..
అయాన్ ముఖర్జీ ఈ మూవీకి డైరెక్టర్ కాగా 2024 లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. NTR30 తర్వాత KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు తారక్.