Jr NTR : జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ NTR 30. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ కనిపించనున్నాడు. ఆచార్య తర్వాత కొరటాల శివ, RRR తర్వాత జూనియర్ చేస్తున్న మూవీ ఇది. అయితే ఈ ప్రాజెక్టు ఓకే అయినప్పటి నుంచి అన్నీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. RRR తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవ్వడంతో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం,
తారకరత్న అకాల మరణంతో ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత ఆర్టిస్టుల షూటింగ్ డేట్స్ సర్దుబాటు కాక కొన్ని రోజులు వాయిదా పడగా.. ఆ మధ్య పడిన అకాల వర్షాల కారణంగా షూటింగ్ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకోని రామోజీ ఫిల్మ్ సిటీలో 16 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించగా తారక్ జ్వరం కారణంగా నిన్న ఉదయం షూటింగ్ మధ్యలో నించి వెళ్ళిపోయాడు. ఈ రోజు షూటింగ్ క్యాన్సల్ చేశారు మేకర్స్.
మళ్లీ ఎన్టీఆర్ కోలుకున్నాక తిరిగి షూట్ ప్రారంభించనున్నారు. ఏదేమైనా NTR30 స్టార్ట్ అయినప్పటి నుంచి అన్నీ అంటకాలే ఎదురవుతున్నాయి. చూడాలి అనుకున్న టైం కి ఈ మూవీ కంప్లీట్ చేస్తారేమో.. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కనించనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రేపు విడుదల చేయనున్నారు మేకర్స్. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలో నటించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.