Kangana Ranaut : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సర్వేశ్ మేవారా దర్శకత్వంలో వస్తున్న తేజస్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ కి గాను ప్రేక్షకుల గురించి మంచి స్పందన వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ట్రైలర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. దేశాన్ని రక్షించే పైలట్, వీర సైనికుల ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా ఉన్నట్టుగా ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది.
ఈ సినిమాలో కంగనా ఫైటర్ గా, జెడ్ పైలెట్ గా తేజస్ గిల్ పాత్రలో నటిస్తుండడం విశేషం. అన్హుల్ చౌహన్, వరుణ్ మిత్ర కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కంగనా రనౌత్ చంద్రముఖి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీక్ వద్ద మంచి హిట్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది.
టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ పర్ఫామెన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచిపోయేలా సాగిందని, ఈ సినిమాకు గాను ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు తేజస్ సినిమాతో కంగనా రనౌత్ మరోసారి ప్రేక్షకులను అలరించబోతుందని అనిపిస్తుంది.