Khushi Movie Review : రౌడీ విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరు కలిసి నటించిన ఖుషి సినిమా పై ఆ ఇద్దరు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.. చాలా కాలంగా ఇద్దరికీ మంచి హిట్ లేక ఖుషీ సినిమాపైనే ఇద్దరు ఆధారపడ్డారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా.. లేదా.. అనే విషయం తెలుసుకుందాం. ఖుషి సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ చిత్రం పైన భారీ అర్జనాలు పెరిగాయి అని చెప్పవచ్చు. పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య ఏర్పడే భావోద్వేగాలను మూల కథగా తీసుకొని దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఈ సినిమా ప్రేక్షకులకు అలరించిందా.. లేదా.. ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఫీలయ్యారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రేమ కథలను సరికొత్త విధంగా చూపించడంలో శివది అందవేసిన చేయి. దానికి నిదర్శనమే నిన్ను కోరి, మజిలీ లాంటి సినిమాలు. ఆ రెండు సినిమాలతో ప్రేమ కథలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు శివ. ఆయన దర్శకత్వంలో వచ్చిందే ఖుషి సినిమా. దీంట్లో ప్రేమ కథను ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్యల అనుబంధాన్ని, గొడవలు చిన్న చిన్న కలహాలు, ఎమోషన్స్, కెమిస్ట్రీ అన్నింటిని కలిపి తెరకెక్కించారు.
ఖుషీ ట్విట్టర్ రివ్యూ.. ఖుషి సినిమాను అమెరికాతోపాటు ఇతర ప్రాంతాల్లో వీక్షించిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఒకరు స్పందిస్తూ ఖుషి ఒక మంచి ఎమోషనల్ జర్నీ, అయినప్పటికీ కామెడీ కూడా అందులో బాగుంది. చివరి 30 నిమిషాలు మాత్రం ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. సామ్, విజయల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వారిద్దరి మధ్యల కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పుకొచ్చారు.
హిట్ కొట్టేశాం..
మరొక యూజర్ అభిప్రాయం తెలుపుతూ.. ఖుషి సినిమాను ఏకంగా సీతారామమ్ సినిమాతో పోల్చారు. అందులో ఎంత గొప్ప ప్రేమ కథ ఉందో ఈ సినిమాలో కూడా ప్రేమ నీట్ గా, ప్యూర్ గా ఉందంటూ.. దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశంసల వర్షాన్ని కురిపించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషన్స్, సీన్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తాయని చెప్పుకొచ్చారు. థియేటర్ల నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఎమోషన్ బాండింగ్ తో బయటికి వస్తాము. మంచి సినిమా అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సామ్ ,విజయ్ ఒక హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.