Kota Bhommali Movie Review : కొన్ని సినిమాలు ముందుగా మంచి టాక్ తెచ్చుకొని పాటలతో, ట్రైలర్ తో ఒక హోప్ ని క్రియేట్ చేస్తాయి. అందులో భాగంగానే కోటబొమ్మాలి సినిమా కూడా వస్తుంది. అయితే కొన్ని సినిమాలు ముందు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న, రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. మరికొన్ని విజయాన్ని సాధిస్తాయి. అయితే ఈరోజు కోటబొమ్మాలి సినిమా రిలీజ్ జరిగింది. ఈ సినిమా చూసిన కొందరు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్ జనాల్లోకి వచ్చి మంచి టాక్ ని తెచ్చుకుంది. అందులో భాగంగానే “లింగిడి” సాంగ్ ప్రేక్షకుల్లో బాగా ఆదరణ పొందింది. ఈ పాటను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలో ముఖ్య తారాగణంగా హీరో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ నటించారు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాపై డైరెక్టర్ హరీష్ శంకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లో కథ సాగుతుందని, శ్రీకాంత్ వరలక్ష్మి, శరత్ కుమార్ నటన చాలా అద్భుతమని ఆయన తెలిపారు. సినిమా మంచి విజయాన్ని సాధించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని శంకర్ వివరించారు. అదే విదంగా ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సినీ హీరో నిఖిల్ కూడా ఈ సినిమాపై స్పందించారు..
ఎమోషనల్ టాక్ తో ఈ సినిమా ముందుకు వెళుతుందని, వరలక్ష్మి తన చేతిలో పామును పట్టుకొని ఎదురుగా చూస్తూ పామును చాలా తేలికగా పక్కకు పడేస్తుంది. ఆ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా అందరి నటన చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను అలరిస్తుంది. మంచి పేరును పొందుతుంది. అని ఆయన మూవీ మేకర్స్ కి కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ట్వీట్ చేశారు.