Krithi Shetty : ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతిశెట్టి. డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. యంగ్ కాలేజ్ గర్ల్ గా కృతి కుర్ర మనసుల్ని దోచేసింది. ఉప్పెన సక్సెస్ తో కృతికి ఒక్కసారిగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకుంది.
అయితే గతకొంత కాలంగా కృతికి తిరోగమనం మొదలైనట్లు కనిపిస్తుంది. కృతిశెట్టి నటించిన ది వారియర్ మూవీ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దాని తర్వాత విడుదలైన సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఫ్లాప్ అవ్వడంతో కృతి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ లు చేరినట్టైంది. తాజాగా కృతి నాగ చైతన్య సరసన ‘కస్టడీ’ తో పర్వాలేదు అనిపించుకుంది.
ఉప్పెన మూవీకి 6 లక్షల పారితోషకం తీసుకున్న కృతి.. వారియర్ టైం కి 60 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో శర్వానంద్ తో ఓ మూవీ కమిట్ అయిన ఈ బ్యూటీ.. తాజాగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. మలయాళం హీరో టివినో థామస్ హీరోగా ‘జితిన్ లాల్ అజయంతే రందం మోషణం’ అనే చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తుండగా.. ఈ సినిమాలో కృతి భాగం కాబోతోంది.