Krithi Shetty in Nithin Movie : ‘ఛలో, భీష్మ’ మూవీలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. ప్రస్తుతం హీరో నితిన్ తో హీరోయిన్ రష్మిక మందన్నాతో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందని, ఈ పాత్రలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోందని తెలుస్తోంది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని క్రేజ్ ఆమాంతం పెంచుకుంది కృతి శెట్టి. ఉప్పెన తర్వాత మరో రెండు మూవీస్ తో హిట్ కొట్టి
హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బేబమ్మను నిరాశపరిచాయి. గతంలో చైతూతో కృతి చేసిన ‘బంగార్రాజు’ హిట్ అవ్వగా తాజాగా వచ్చిన ‘కస్టడీ’ మాత్రం ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరోసారి నితిన్ జోడీ కడుతున్నట్టు తెలుస్తుంది. గతంలో నితిన్ సరసన కృతి ‘మాచర్ల నియోజక వర్గం’ లో చేసింది అది అంతగా ఆడలేదు. దీంతో ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో మరీ..
నితిన్ కి మాత్రమే కాదు.. కృతికి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ ప్రాణాంతకమైన డిసీజ్ తో చావుకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి కథ అని తెలుస్తుంది. మొత్తానికి సీరియస్ కథతో నితిన్ ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది. భీష్మ తర్వాత వెంకీ కుడుముల – నితిన్ ల కాంబినేషన్ వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి.