Kushi Movie Update : చాలాకాలంగా రౌడీ హీరో విజయ్ మూవీస్ ఏం రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీ లైగర్ విజయ్ దేవరకొండ కేరీర్ బిగ్గేస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో విజయ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘ఖుషి’ పైనే పెట్టుకున్నాడు. ఈ మూవీలో విజయ్ కి జోడిగా సమంత నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇదిలావుండగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో మరో గెస్ట్ రోల్ ఉంటుందని తెలుస్తుంది. ఇది విలన్ రోల్ అని, సెకండాఫ్ లో వచ్చే ఈ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర నటిస్తున్నాడని సమాచారం. నవీన్ చంద్ర, సమంతకి అన్నయ్య పాత్రలో నటిస్తున్నాడని టాక్ కాగా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్. శివ నిర్వాణ అంటేనే ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్.
ఈ చిత్రాన్ని కూడా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడట. అయితే ఈ రోజు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఖుషి నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 1 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. విజయ్ సమంత ఈ చిత్రంలో కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీలో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలకపాత్రాల్లో నటిస్తున్నారు.
Discussion about this post