Miss Shetty Mr. Polishetty Movie Review : ఐదు సంవత్సరాల తర్వాత అనుష్క నటించిన అలాగే అనుష్కకు జంటగా జాతి రత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా మిస్ శేట్టి మిస్టర్ పోలిశెట్టి ఈ సినిమా భారీ అంజనాలతోటి బరిలోకి దిగింది. కానీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించిందా.. అందరూ ఊహించినట్టుగా సక్సెస్ మాటను అందుకుందా.. లేదా.. ఇప్పుడు తెలుసుకుందాం.
కథ : అన్విత (అనుష్క) లండన్ లో ప్రఖ్యాత చెఫ్ ఆమె తల్లి జయసుధ. అయితే అనుష్కకు ఎలాగైనా పెళ్లి చేయాలని జయసుధ చాలా ఆరాటపడుతుంది. కానీ అనుష్క పెళ్లికి సముకత చూపదు. తన తల్లికి జబ్బు చేయడం వలన చనిపోతుంది. తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన అనుష్క ఆ ఒంటరితనాన్ని భరించలేక ఒక బిడ్డకు తల్లి కావాలనుకుంటుంది. కానీ శారీరక సంబంధం లేకుండా ఓ బిడ్డను పొందాలి..సరోగసి ద్వారా అనుకుంటుంది. ఇందుకోసం నవీన్ పోలిశెట్టి (సిద్దుతో ) పరిచయం ఏర్పడ్డాక తన కోరికను అతనితో చెబుతుంది. అతను ఏం చేశాడు..? అసలు కథ ఎలా సాగింది..? కథలో జీవం ఉందా? లేదా? అనుష్క అలాంటి వింత కోరిక తోటి నెగ్గ గలిగిందా..? అనేది సినిమాలో తెలుసుకోవలసిందే.
విశ్లేషణ : రోటీన్ కథతోనే సినిమా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఆల్రెడీ సరోగసి మీద ఇంతకుముందు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా దర్శకుడు అదే సినిమాని ఎంచుకొని బరిలోకి దిగాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లో అనుష్క తల్లి సెంటిమెంట్ తో సినిమా మొదలవుతుంది. కానీ ముందే సినిమా మొత్తం ప్రేక్షకుడికి అర్థమయిపోతుందేమో అనే విధంగా అనిపిస్తుంది. అలాంటి సీన్లను కాస్త దర్శకుడు ఆలోచించే పెట్టాల్సింది. అలాగే హీరో నవీన్ సీన్లు ప్రారంభం కాగానే కాస్త సినిమా పుంజుకున్నట్టుగా అనిపిస్తుంది. అతని సీన్లు, జోకులు బాగానే పేలాయి అని చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఏదో సాగదీతగా, మనం ఇంతకుముందే చూసినట్టుగా మనకు కథ అర్థమయిపోయినట్టుగా యావరేజ్ గా సాగిపోతుంది.
సెకండ్ హాఫ్ ఒక కామెడీ టైమింగ్ తో ప్రారంభమై 50 నిమిషాలు వరకు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. ఆ సిన్స్ తర్వాత మళ్లీ సినిమా బోరింగ్ గా మూడు లోకి వచ్చేస్తుంది. హీరోకి అసలు కథ అర్థం కాకపోవడము, అతని కన్ఫ్యూజ్ అవ్వడము, కాస్త అటు ఇటుగా అనిపించినప్పటికీ అనుష్క పిల్లలకు తండ్రి హోదా హీరో కి ఇవ్వాలని అనుకుంటుంది. తర్వాత తన నిర్ణయాన్ని మార్చేసుకుంటుంది.. అలా ఎందుకు మారుతుంది అనేదానికి క్లారిటీ జస్టిఫికేషన్ లేకపోవడం ఇక్కడ కాస్త తికమకగా అనిపిస్తుంది. ఇక విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. హీరో క్యారెక్టరైజేషన్, నవీన్ నటన ఆకట్టుకుంటాయి. రాధన్ పాటలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పవచ్చు. ఇక సినిమా ప్లస్ ల విషయానికొస్తే నవీన్ కేరక్టరైజేషన్, నేపథ్య సంగీతం, చాలా రోజుల తర్వాత అనుష్క తెరపై కనిపించడం లాంటివే ఇక్కడ ప్లస్ పాయింట్స్.
మైనస్లు అయితే చాలానే ఉన్నాయి అని చెప్పొచ్చు. సాంగ్స్ బాగోలేకపోవడం వీక్ క్లైమాక్స్ యూనివర్సల్ ఆపిల్ లేని స్టోరీ, ఎప్పుడో చూసినట్టుగా అనిపించడం, స్టోరీ ముందుగానే ప్రేక్షకుడికి అర్థం అయిపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మైనస్ లు ఉన్నాయి. యూత్ ను కొంతవరకు మెప్పిస్తుంది అనుకోవచ్చు. దానికి కూడా మెయిన్ రీసన్ నవీన్ పోలిశెట్టిని చూపించవచ్చు. సెకండ్ హాఫ్ లో కామెడీ లేకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ అని చెప్పాలి. క్లైమాక్స్ ను దర్శకుడు కాస్త గట్టిగా ప్లాన్ చేసి ఉంటే ఇంకా ప్లస్ అయ్యేది. మొత్తానిగా ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమా యావరేజ్ స్టాక్ ను రాబట్టుకుంది.