Negative Comments on Baby : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా చేస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ కి సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో విజువల్స్ ప్లజంట్ గా వున్నాయి.
“మాకు మీ అంత బలం లేకపోవచ్చు. కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఎవ్వడూ కొట్టలేడు” అని చివర్లో అమ్మాయి చెప్పే డైలాగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తంగా 3 నిమిషాల 18 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఎమోషనల్గా సాగింది. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం కూడా సినిమాకు తగ్గట్టు హృద్యంగా ఉంది. అయితే మొదటి నుంచి కూడా హీరోయిన్ ని డీ గ్లామరస్ గా చూపించడంపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయ్.
చివరకు నిన్న ట్రైలర్ వచ్చాక కూడా అదే రిపీట్ అయ్యింది. హీరోయిన్ ట్రాన్స్ఫర్మేషన్ పై కూడా లేటెస్ట్ గా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాగా బేబీ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇలాంటి కామెంట్స్ నిజానికి అనవసరం, సినిమా చూసిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని చెప్పడం బెటర్ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. దీనికి ప్రతిగా నెటిజన్స్ అది అట్ట చెప్పు అంటూ హీరోకి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. జూలై 14వ తేదీన బేబీ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
Hot take, but mostly an unnecessary / woke take.
Maybe you can watch the movie and then comment before jumping the gun. https://t.co/qfk5JGZCok
— Anand Deverakonda (@ananddeverkonda) July 7, 2023