కర్రల సాయంతో నడవలేని స్థితిలో ఎన్టీఆర్ పార్ట్నర్.. ఫ్యాన్స్ లో మొదలైన ఆందోళన
ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ హిట్ తర్వాత తారక్ నటించే ప్రతి చిత్రం పాన్ ఇండియా మూవీగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ తో అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి.
ఎన్టీఆర్ నటించబోతున్న మరో పాన్ ఇండియా మూవీ వార్ 2. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా హై ఓల్టేజ్ యాక్షన్ తో ఈ చిత్రం ఉండబోతోంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. మరో హీరోగా బాలీవుడ్ క్రేజీ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
వీలైనంత త్వరగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఊహించని షాక్ తగిలింది. హృతిక్ రోషన్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయన చేసిన లేటెస్ట్ పోస్ట్ అభిమానులలో ఆందోళన పెంచుతోంది. అయితే తాను ప్రస్తుతం కోలుకుంటున్నానని హృతిక్ భరోసా ఇచ్చారు.
కానీ వార్ 2 షూటింగ్ మరింత ఆలస్యం కావడం మాత్రం అనివార్యంగా మారింది. హృతిక్ ని చూస్తుంటే కర్రల సాయంతో, వీల్ చైర్ సాయంతో నడవలేని స్థితిలో కనిపిస్తున్నాడు. అంటే హృతిక్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. అప్పటి వరకు వార్ 2 మొదలు కావడం కష్టం. ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ హీరో తో కలసి నటిస్తున్న చిత్రం కాబట్టి ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ఈ ప్రాజెక్టుకి ఇలా ఆటంకాలు కలుగుతుండడంతో తారక్ ఫ్యాన్స్ ఆందోళనకి గురవుతున్నారు. తారక్ పార్ట్నర్ త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు.
2019లో విడుదలైన వార్ చిత్రానికి సీక్వెల్ గా వార్ 2 ఉండబోతోంది. మొదటి భాగంలో హృతిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ నటించారు. టైగర్ ష్రాఫ్ మొదటి భాగంలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే పార్ట్ 2లో ఎన్టీఆర్ రోల్ ఏంటనే సస్పెన్స్ కొనసాగుతోంది.