NTR30 Update : RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన సినిమా పోస్టర్స్ ని చూస్తుంటే..
మంచి యాక్షన్ సినిమానే కొరటాల సిద్ధం చేస్తున్నట్లు అనిపిస్తుంది. NTR30 యాక్షన్ సీక్వెన్సులతో పాటు వీఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఎన్టీఆర్ – సైఫ్ అలీ ఖాన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం సముద్రం దాని చుట్టూ అల్లుకున్న కథ కావడంతో.. సముద్రం దగ్గర షూట్ చేయడం భద్రతాకారణాల దృష్ట్యా
కష్టమని సముద్రం సెట్ ని వేస్తుంది NTR30 టీం. దీనికోసం గతకొన్ని రోజులుగా సెట్ పనిలో నిమగ్నమయ్యారు. శంషాబాద్ లో ఈ సముద్రం సెట్ వేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ ముగిశాక జూన్ 5 నుంచి శంషాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. రేపు తారక్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఫ్యాన్స్, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.