Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ బ్రో ది అవతార్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ షూటింగ్స్ తో బిజీగా ఉండగా త్వరగా వీటిని కంప్లీట్ చేసి మళ్లీ రాజకీయాల్లో బిజీ కానున్నారు. అయితే గతంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం పొలిటికల్ యాక్షన్ డ్రామా అయిన గేమ్ చేంజర్ ను ప్లాన్ చేయగా, పవన్ డేట్స్ లేకపోవడంతో ఆ స్క్రిప్ట్ ని ప్రొడ్యూసర్ దిల్ రాజు సూచన మేరకు
రామ్ చరణ్ తీస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది ఏపీ ఎన్నికలు ముగియడంతో ఆ తర్వాత పవన్ మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. దీంతో శంకర్ ఎలాగైనా పవన్ తో ఓ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసి పనిలో ఉన్నాడట. త్వరలో దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ తో పాటు, కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీతో బిజీగా ఉన్నాడు.