Pawan Kalyan : గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. చిత్రం ఫస్ట్ గ్లింప్స్ తోనే అదిరే రెస్పాన్స్ ని అందుకోవడం మొదట్లో ఈ సినిమాపై వచ్చిన నెగిటివిటీ అంతా పోయింది. ఈ చిత్రంలో పవన్ కు జోడిగా కన్నడ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా..
మరో హీరోయిన్ కూడా ఈ చిత్రంలో కనిపించే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే ఆ హీరోయిన్ టాలీవుడ్ కి రీసెంట్ గా పరిచయమైన సాక్షి వైద్య అన్నట్టు తెలుస్తుంది. ఏజెంట్ సినిమాతో ఉత్తరాది భామ సాక్షి వైద్య తెలుగు తెరకు పరిచయమైంది. ప్రెసెంట్ మెగా హీరో వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున సినిమాలో కూడా నటిస్తుంది సాక్షి. సాయిధరమ్ తేజ్ నెక్ట్ మూవీలో కూడా సాక్షిని తీసుకునే ఛాన్స్ ఉంది.
బ్యాక్ టి బ్యాక్ మెగా హీరోల సినిమాల్లో సాక్షి వైద్య ఛాన్సులు అందుకుంది సాక్షి వైద్య. దీంతో పవన్ ఉస్తాద్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని అర్థమవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మాస్ కాంబో కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎటువంటి మాస్ బీట్ ఇస్తాడో చూడాలి.