పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ లో పవన్ ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఆహా వేదికగా బాలయ్య అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అన్ స్టాపబుల్ షో టాప్ రేంజ్ కు వెళ్లింది. అయితే తాజాగా హూస్ట్ గా బాలయ్య, గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో షూటింగులో పాల్గొన్నారు.
పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్, క్రిష్ కూడా రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.
Discussion about this post