రాంచరణ్ కి పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఇలా షాకిచ్చాడేంటి.. అప్పుడు ఎన్టీఆర్ కి కూడా అంతే..
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తదుపరి చిత్రానికి భారీగా సన్నాహకాలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ పీరియాడిక్ డ్రామాలో నటించబోతున్నారు. రంగస్థలం చిత్రానికి 10 రెట్లు ఉండేలా.. పాన్ వరల్డ్ ప్రాజెక్టు గా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
సుమారు 400 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సంగీత దర్శకుడు మాత్రం ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ చిత్రంలో నటించబోతున్నట్లు విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్, జాన్ అబ్రహం ఇలా ప్రతి రోజు ఒక్కో నటుడి పేరు వినిపిస్తోంది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రాంచరణ్, బుచ్చిబాబు చిత్రానికి పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఊహించని షాక్ ఇచ్చారట. అవును మీరు వింటున్నది నిజమే. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం బుచ్చిబాబు నారాయణ మూర్తిని సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే నారాయణ మూర్తి ఇలా క్యారెక్టర్ రోల్స్ కి దూరంగా ఉంటారు.
ఆయనది ఎప్పుడూ ఒకటే పంతం. బుచ్చిబాబు ఇచ్చిన ఆఫర్ ని నారాయణ మూర్తి సున్నితంగా కుదరదని చెప్పారట. బలమైన ఎమోషనల్ కంటెంట్ ఉండే రోల్ కోసం బుచ్చిబాబు ఆయన్ని అడిగినట్లు తెలుస్తోంది. కానీ నారాయణ మూర్తి ఒప్పుకోలేదు.
గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టెంపర్ చిత్రంలో నారాయణ మూర్తి నటించాల్సింది. అప్పుడే ఆయన పూరికి నో చెప్పారు. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి పోసాని వచ్చారు. ఇంతటి పాన్ వరల్డ్ సబ్జెక్టు వచ్చినప్పుడు నటించాల్సింది అని నెటిజన్లు అంటున్నారు. కొందరేమో నారాయణ మూర్తి గారు తన సిద్ధాంతాలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటారని అంటున్నారు. కమ్యూనిజం భావజాలంతో నారాయణ మూర్తి తెరకెక్కించే చిత్రాలు ప్రేక్షక ఆదరణ పొందాయి.