Postponement of Salar : ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా సలార్ మూవీ వస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. సలాడ్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళం స్టార్ హీరో పృధ్వి రాజు, జగపతిబాబు మెయిన్ విలన్స్ గా నటిస్తున్నారు. అలాగే శ్రీయ రెడ్డి ఒక ప్రముఖ పాత్రలో నటిస్తుందని విషయం తెలిసిందే.
ఈ సినిమా రెండు పార్టులుగా ఉంటుందని, ఇటీవల మొదటి పార్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ పెంచారు డైరెక్టర్ ప్రశాంత్ నిల్…అయితే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తూ ఉంది. ఇప్పుడు మరోసారి తాజాగా వాయిదా పడిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది.
కానీ చిత్ర యూనిట్ దీనిపై ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ డైలమాలో ఉండిపోయారు. ఎట్టకేలకు చిత్ర యూనిట్ దీనిపైన స్పందించారు. సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సిన సలార్ మూవీ గురించి ఎటువంటి ప్రమోషన్ చేయలేదు. అయితే పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని ఆ కారణంగా సినిమా వాయిదా పడుతుందని ఆ చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే రిలీజ్ తేదీ ప్రకటిస్తాము అని వివరించారు.