Prabhas – Maruti : ప్రభాస్ సినిమా అంటేనే ప్రేక్షకులు అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తారు. ప్రభాస్ ఆల్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతా భారీ బిజీ షెడ్యూల్లో కూడా ఆయన మారుతితో సినిమా తీయడానికి కమిట్ అయ్యారు. ఈ సినిమాలో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు కోలీవుడ్లో చాలా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ అలాగే విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమా ద్వారా మనకు సుపరిచితమైంది.
ఎప్పుడు ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన కొత్త ఫొటోస్ ని హాట్ హాట్ గా పోస్ట్ చేస్తూ ఎప్పుడూ కుర్రకారును మత్తెక్కిస్తుంది. మారుతి, ప్రభాస్ హీరోగా తీస్తున్న సినిమాలో నటిస్తున్న మాళవిక పై ఒక ఫైటింగ్ సీను డైరెక్ట్ చేశారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒక మార్కెట్లో ఫైటింగ్ జరుగుతుండగా దాంట్లో మాళవిక ఫైట్ చేస్తున్న సీన్ కనిపిస్తుంది.
ఆమె ఫన్నీగా ఆ వీడియోను ఇన్స్టాల్ షేర్ చేసింది. ఇప్పుడు అది కాస్త హాట్ టాపిక్ ఆయిపోయింది. మా హీరో ప్రభాస్ పక్కన ఉండగా హీరోయిన్ తో ఫైటింగ్ సీన్స్ చేపిస్తావా అని ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి నీ ట్రోల్ చేస్తున్నారు ఆ వీడియో క్లిప్పు ప్రభాస్ సినిమాలోదేనా.. కాదా.. అనేది ఇంకా ఇప్పటికి క్లారిటీ లేదు. ఒకవేళ అది ప్రభాస్ సినిమాలోది అయితే మాత్రం మారుతి, ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావాల్సిందే అంటున్నారు.